ఎక్స్‌డీలో కోచ్చడయాన్ ట్రైలర్ | Eksdilo Koccadayan Trailer | Sakshi
Sakshi News home page

ఎక్స్‌డీలో కోచ్చడయాన్ ట్రైలర్

Apr 12 2014 1:20 AM | Updated on Sep 2 2017 5:54 AM

ఎక్స్‌డీలో   కోచ్చడయాన్ ట్రైలర్

ఎక్స్‌డీలో కోచ్చడయాన్ ట్రైలర్

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. రజనీ నటించిన కోచ్చడయాన్ చిత్రం ట్రైలర్‌ను వేలాచ్చేరి ఫినిక్స్‌మాల్‌లోని ఎక్స్‌డీ థియేటర్‌లో శుక్రవారం ప్రదర్శించారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. రజనీ నటించిన కోచ్చడయాన్ చిత్రం ట్రైలర్‌ను వేలాచ్చేరి ఫినిక్స్‌మాల్‌లోని ఎక్స్‌డీ థియేటర్‌లో శుక్రవారం ప్రదర్శించారు.

రజనీ, దీపికాపదుకునే హీరో హీరోయిన్లుగా సౌందర్యా రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన కోచ్చడయాన్ చిత్రం ఎప్పుడు విడుదలవుతాందా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ల క్రితం రోబో విడుదల అనంతరం రాణా చిత్రం పూజాకార్యక్రమాల వేడుకలో రజనీ తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యూరు.
 
సుదీర్ఘ విరామం తరువాత సుమారు వందకోట్ల బడ్జెట్‌తో కోచ్చడయాన్ రూపుదిద్దుకుంది. అయితే ఆ సినిమా విడుదలకు ముందే ట్రైలర్ రూపం లో ఎక్స్‌డీ థియేటర్లో ప్రదర్శనకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ ప్లే సంస్థ డైరక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, దేశంలోనే తొలి సారిగా ఎక్స్‌డీ థియేటర్లో సినిమా ట్రైలర్ ప్రదర్శన జరుగుతోందన్నారు. త్రీడీ అంటూ మూడు డైమన్షన్లు, ఎక్స్‌డీ అంటే  పలు డైమన్షన్లలో ప్రేక్షకులు అనుభూతి పొందవచ్చని తెలి పారు.
 
ఉదాహరణకు సినిమాలో వర్షం పడితే థియేటర్లోని ప్రేక్షకులపై చిరుజల్లు లు పడినట్లు ఉంటుందని తెలిపారు. భారత్‌కు ఇటువంటి థియేటర్లు ఇటీవలే పరిచ యం అయ్యాయని, చెన్నైలో ఇపుడు ప్రారంభించిన ఫినిక్స్‌మాల్ తో పాటూ ఎక్స్‌ప్రెస్ అవెన్యూ, కోయంబత్తూరులో ఎక్స్‌డీ థియేటర్లు ఉన్నట్లు చెప్పారు. త్వరలో లక్నో, జైపూర్‌లలో నిర్మిస్తున్నామని అన్నారు. కేవలం 40 సీట్ల కెపాసిటీ గల ఇక్కడి ఎక్స్‌డీ థియేటర్లో  కోచ్చడయాన్ ప్రదర్శిస్తామని తెలిపారు.
 
సుమారు 15 నుంచి 20 నిమిషాలు నిడివిగల ఈ సినిమాలకు టికెట్ ధర రూ.200గా ఆయన తెలి పారు. మీడియా సమావేశంలో సంస్థ మరో డెరైక్టర్ రాజ్ మోహన్, మీడియావన్ డెరైక్టర్ టిమ్ మోసెస్ పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement