`ఈ కథలో పాత్రలు కల్పితం` థీమ్ పోస్టర్ | EE Kathalo Patralu Kalpitam Telugu Movie Theme Poster out | Sakshi
Sakshi News home page

`ఈ కథలో పాత్రలు కల్పితం` థీమ్ పోస్టర్

May 22 2020 2:56 PM | Updated on May 22 2020 2:56 PM

EE Kathalo Patralu Kalpitam Telugu Movie Theme Poster out - Sakshi

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్‌ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ ప్రేక్షకుల నుంచి పాజిటీవ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. షూటింగ్‌ తుదిదశకు చేరుకున్న ఈ చిత్ర థీమ్‌ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. 

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటివరకు చిత్రీకరించిన వరకు ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. దర్శకుడు అభిరామ్ మంచి విజన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  

'జెస్సీ', రీసెంట్ గా వచ్చిన ' ఓ పిట్టకథ ' సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌  సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, 'ఆర్‌ఎక్స్‌ 100', 'కల్కి' చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తి అవగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తాం. త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజన్‌  పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. 

చదవండి:
నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత
దానవ మానవుల పాతాళ్‌ లోక్‌

Advertisement
 
Advertisement
Advertisement