నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసి షాకయ్యారు: సోనాలి బిం‍ద్రే

Early Detection Of Cancer Is Essential Said By Sonali Bendre - Sakshi

ముంబాయి: బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే గత ఏడాది నుంచి హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెల్సిందే. క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడం, వ్యాధి గురించి ప్రజలను చైతన్యం చేయడమనేది తప్పనిసరి బాధ్యతని సోనాలి బెంద్రే గుర్తు చేశారు. గత ఏడాది జూలైలో సోనాలి బింద్రేకు క్యాన్సర్‌ సోకిందని నిర్ధారణ కావడంతో ఆమె చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లారు. సుమారు 6 నెలల చికిత్స తర్వాత డిసెంబర్‌లో ముంబాయికి తిరిగి వచ్చారు. కన్సార్టియం ఆఫ్‌ అక్రిడేటెడ్‌ హెల్త్‌కేర్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఐదో అంతర్జాతీయ కాన్పరెన్స్‌ కార్యక్రమంలో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి మాట్లాడుతూ.. వ్యాధి భయంకరమైనది అయినప్పటికీ ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సమయంలో బాధ తక్కువగా ఉండేలా చేసుకోవచ్చన్నారు.

ముందుగా గుర్తించడమనేది చాలా ముఖ్యమైన విషయమన్నారు. ప్రస్తుతం వ్యాధి అంత భయానకమైనది కాకపోయినప్పటికీ చికిత్స సమమంలో ఎక్కువ భయపడటంతో పాటు బాధపడాల్సి వస్తోందని తెలిపారు. తనకు క్యాన్సర్‌ వ్యాధి ఉందని నిర్ధారణ అయినపుడు, తన కుటుంబంలోని సభ్యులకు కూడా గతంలో క్యాన్సర్‌తో చనిపోయారనే విషయం తెలిసిందని చెప్పారు. తనకు క్యాన్సర్‌ వ్యాధి ఉందని తెలిసి చాలా మంది షాక్‌ అయ్యారని గుర్తు చేశారు. క్యాన్సర్‌పై విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యాధుల గురించి అవగాహన పెంచడంపై ఆసుపత్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top