దొంగ స్వామీజీ ప్రేమ! | Dwarka will release on march 3rd | Sakshi
Sakshi News home page

దొంగ స్వామీజీ ప్రేమ!

Feb 13 2017 11:59 PM | Updated on Aug 14 2018 3:47 PM

దొంగ స్వామీజీ ప్రేమ! - Sakshi

దొంగ స్వామీజీ ప్రేమ!

విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్‌.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్‌ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారకా’.

విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్‌.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్‌ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారకా’. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. మార్చి 3న విడుదల చేయాలనుకుంటున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ – ‘‘క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దొంగ స్వామీజీగా విజయ్‌ దేవరకొండ అద్భుతంగా నటించారు. వైవిధ్యమైన కథ, కథనాలకి తోడు పూజా ఝవేరి గ్లామర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement