ద్వారక టీమ్‌తో మరో సినిమా చేస్తాం | Dwaraka movie success meet in Hyderabad | Sakshi
Sakshi News home page

ద్వారక టీమ్‌తో మరో సినిమా చేస్తాం

Mar 6 2017 11:14 PM | Updated on Aug 14 2018 3:47 PM

ద్వారక టీమ్‌తో మరో సినిమా చేస్తాం - Sakshi

ద్వారక టీమ్‌తో మరో సినిమా చేస్తాం

‘‘ద్వారక’ చిత్రం హిట్‌ అయినందుకు హ్యాపీ. ఇరవైఏళ్ల మా కల ఈ సినిమాతో తీరింది. ‘ద్వారక’కు మంచి టీమ్‌ కుదిరింది. ఇదే టీమ్‌తో మరో సినిమా చేస్తాం.

‘‘ద్వారక’ చిత్రం హిట్‌ అయినందుకు హ్యాపీ. ఇరవైఏళ్ల మా కల ఈ సినిమాతో తీరింది. ‘ద్వారక’కు  మంచి టీమ్‌ కుదిరింది. ఇదే టీమ్‌తో మరో సినిమా చేస్తాం. ఈ నెల 8, 9, 10న విజయ యాత్రకు వెళ్లబోతున్నాం’’ అని నిర్మాతలు ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్‌ పెనుబోలు చెప్పారు. విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్‌.బి.చౌదరి సమర్పణలో శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద్వారక’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తొలిరోజు నుంచే మా సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణ చూసి చాలా ఆనందంగా అనిపిస్తోంది. అన్ని వర్గాల వారు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా చూస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా విడుదలైనప్పటి నుంచి చాలా మంది ఫోన్లు చేసి, అభినందించారు’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. ‘‘నా గత చిత్రాల కంటే ఈ చిత్రంలో చాలా అందంగా ఉన్నానని పలువురు చెబుతుంటే హ్యాపీగా ఉంది’’ అని పూజా ఝవేరి చెప్పారు. నటుడు పృధ్వీ, రచయిత లక్ష్మీభూపాల్, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement