డాన్ సీక్వల్‌కు రెడీ..! | Don 3 on cards says Shah rukh Khan | Sakshi
Sakshi News home page

Dec 20 2017 1:13 PM | Updated on Dec 20 2017 1:13 PM

Don 3 on cards says Shah rukh Khan - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రీమేక్ మూవీ డాన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన డాన్ సినిమాకు రీమేక్ గా 2006లో షారూఖ్ డాన్ తెరకెక్కింది. డాన్‌ పాత్రలో షారూఖ్ ను చూసిన అభిమానులు ఘనవిజయాన్ని అంధించారు. దీంతో ఐదేళ్ల తరువాత మరోసారి డాన్ పాత్రలో నటించాడు షారూఖ్. డాన్ 2గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. షారూఖ్ లుక్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరోసారి డాన్ పాత్రలో నటించనున్నట్టుగా ప్రకటించాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న షారూఖ్ త్వరలో డాన్ 3లో నటించబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు కథ రెడీ చేసే పనిలో ఉన్నట‍్టుగా నిర్మాత రితేష్ సిద్వానీ తెలిపారు. తొలి  రెండు భాగాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా.. మూడో భాగానికి మాత్రం దీపికను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement