ఆ స్టార్‌తో మరో ఛాన్స్‌ లేనట్టే..

 Disha Patani Reveals She Might Not Work With Salman Khan - Sakshi

ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి భారత్‌ మూవీలో ఆడిపాడిన నటి దిశా పటానీ మరోసారి సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించకపోవచ్చని అన్నారు. భారత్‌లో తమ మధ్య కెమిస్ర్టీ చక్కగా కుదిరిందని తమ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ర్టీకి ఆడియన్స్‌ ఫిదా అవుతారని చెప్పుకొచ్చారు. ఈ మూవీలో సల్మాన్‌ ఖాన్‌ 20, 30 ఏళ్ల యువకుడిగా ఉన్న సందర్భంలో వచ్చే పాటలో తాను ఆయన సరసన డాన్స్‌ సీక్వెన్స్‌లో నటించానని అందుకే సీనియర్‌ నటుడైన సల్మాన్‌తో పనిచేసేందుకు తాను సంతోషంగా అంగీకరించానని తెలిపారు.

తమ ఇద్దరి మధ్య ఉన్న వయోభేదం కారణంగా మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు రాకపోవచ్చని చెప్పారు. భారత్‌ మూవీ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ సైతం ఇదే విషయం తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఐదు డిఫరెంట్‌ లుక్స్‌తో కనిపించే భారత్‌ మూవీ జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top