టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ | Director of Tippu signs his next Movie | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌

Jan 7 2020 5:51 AM | Updated on Jan 7 2020 5:51 AM

Director of Tippu signs his next Movie - Sakshi

జగదీష్‌ దానేటి, జాని మార్టిన్‌

భారతీయ సినిమా నుంచి హాలీవుడ్‌ వరకూ వెళ్లాలనే కల చాలామందికి ఉంటుంది. అయితే కొందరికి అది కలగా మిగిలిపోతుంది. కానీ తన ప్రతిభతో భారతీయ సినీ దర్శక, రచయిత జగదీష్‌ దానేటి హాలీవుడ్‌ వరకూ వెళ్లారు. హాలీవుడ్‌లో ‘జె.డి.’ పేరుతో ఎంట్రీ ఇచ్చిన జగదీష్‌ పలు అంతర్జాతీయ చిత్రాలకు ‘క్రియేటివ్‌ కన్సల్టింగ్‌’ చేయటంలో విశేష నైపుణ్యం సాధించారు. హాలీవుడ్‌ ప్రఖ్యాత ప్రొడక్షన్‌ కంపెనీ మార్టిన్‌ ఫిలిమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు జగదీష్‌.

లాస్‌ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన ఒక వేడుకలో ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు–నిర్మాత జాని మార్టిన్‌.. జేడీతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘జె.డి. రాసిన కథలు, స్క్రీన్‌ప్లే అద్భుతం. అందుకే ఆయన దర్శకత్వం వహించబోతున్న హాలీవుడ్‌ చిత్రాలకు నేను నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నా’’ అన్నారు జాని మార్టిన్‌. ఈ ఇండో–అమెరికన్‌ చిత్రాల్లో హాలీవుడ్‌ నటులతో పాటు భారతీయ సినిమాకి సంబంధించిన నటీనటులను కూడా నటింపజేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement