విశ్వదర్శనం ; కళాతపస్వి బయోపిక్‌ | Director K Viswanath Biopic Started | Sakshi
Sakshi News home page

విశ్వదర్శనం ; కళాతపస్వి బయోపిక్‌

Jul 27 2018 8:40 PM | Updated on Jul 27 2018 8:57 PM

Director K Viswanath Biopic Started - Sakshi

టాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ల బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో సీనియర్‌ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్‌ చేరారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. 

విశ్వనాథ్‌ బయోపిక్‌కు ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించనున్నారు. నేడు జరిగిన పూజ కార్యక్రమంలో విశ్వనాథ్‌, తనికెళ్ల భరణి, జనార్ధన మహర్షితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో విశ్వనాథ్‌ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది.  ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన విశ్వనాథ్‌ జీవితంపై సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో పలువురు సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement