విభిన్న ప్రేమకథ | Different Love story | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రేమకథ

Feb 10 2015 11:42 PM | Updated on Sep 2 2017 9:06 PM

విభిన్న ప్రేమకథ

విభిన్న ప్రేమకథ

సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు

సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా పరిచయమవుతు న్నారు. రెగ్యులర్ లవ్‌స్టోరీలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో నవీన్ విజయ్ కృష్ణ సరసన కీర్తీ సురేశ్ నాయిక. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. రామ్ ప్రసాద్ రఘుతు దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అడ్డాల చంటి మాట్లాడుతూ -‘‘సినిమా బాగా వస్తోంది. ఏప్రిల్ 10న విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ప్రేమకథలో సందేశం కూడా ఉంటుంది. ఈ చిత్రానికి నాగబాబు, రాహుల్‌దేవ్ పోషించిన పాత్రలు హైలైట్’’ అని దర్శకుడు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement