డై..లాగి కొడితే...

డై..లాగి కొడితే... - Sakshi


సినిమా : సుస్వాగతం

రచన:  చింతపల్లి రమణ

దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు

మూడేళ్లుగా సంధ్యని (దేవయాని) ప్రేమిస్తుంటాడు గణేశ్ (పవన్ కల్యాణ్). కానీ, ఆమెకు తన ప్రేమ విషయం చెప్పడు. వారం రోజులు ఉమెన్స్ కాలేజీకి సెలవులు వస్తాయి. సంధ్యను చూడకుండా అన్ని రోజులు ఉండలేనని, వెంటనే తనను చూడాలని మిత్రులతో చెబుతాడు గణేశ్. అందరూ కలిసి సంధ్య ఇంటి దగ్గరకు వెళతారు. మేడపైన బట్టలు ఆరేస్తున్న సంధ్యని చూసి హ్యాపీ అవుతాడు గణేశ్. అదే టైమ్‌లో  ఒకతను సంధ్యకి సైగలు చేస్తుంటాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ అయిన సంధ్య నాన్న వాసుదేవ రావు (ప్రకాశ్‌రాజ్) సైగలు చేస్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటిస్తాడు.

నా కూతురికే లైనేస్తావా..

నేను మోనార్క్‌ని..

నన్నెవరూ మోసం చేయలేరు అంటాడు. ఈ డైలాగ్ ఆ చిత్రంలో పలుమార్లు వస్తుంది. మోనార్కులందరూ.. ఏదో సందర్భంలో ఈ డైలాగ్‌ని హ్యాపీగా వాడేసుకుంటుంటారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top