డై..లాగి కొడితే.... | Dialog from athadu movie | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే....

Nov 10 2016 11:20 PM | Updated on Sep 4 2017 7:44 PM

డై..లాగి కొడితే....

డై..లాగి కొడితే....

పూరి(త్రిష) అక్కకు పెళ్లి చూపులు జరుగుతుం టాయి. ఆ టైమ్‌లో పూరి తన బావ పార్థసారథి అలియాస్ పార్థు (మహేశ్‌బాబు) రూమ్‌కి వస్తుంది.

సినిమా : అతడు
 రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
 
పూరి(త్రిష) అక్కకు పెళ్లి చూపులు జరుగుతుం టాయి. ఆ టైమ్‌లో పూరి తన బావ పార్థసారథి అలియాస్ పార్థు (మహేశ్‌బాబు) రూమ్‌కి వస్తుంది. ‘నువ్వేంటి ఇక్కడ’ అని ప్రశ్నిస్తాడు పార్థు. ‘నువ్వింకా ఎదగాలి పార్థూ! ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్లావు. పక్కనే ఒక బెంజ్ ఉంది. నువ్వు ఏది కొంటావ్? నువ్వు ఒక పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్లావ్.. పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది. నువ్వు ఏది కొంటావ్?
 ‘అక్క అంబాసిడర్.. నేను బెంజ్. అది పోర్టబుల్  నేను ప్లాస్మా. అది లైఫ్‌బాయ్.. నేను లక్స్’ అందుకే నా అందం దానికి సమస్య కాకూడదని ఇలా వచ్చా’నని సమాధానమిస్తుంది పూరి. అమాయకమైన భావాలతో త్రిష పలికిన ఈ డైలాగ్ మహిళలకూ తెగ నచ్చేసిందనుకోండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement