breaking news
Athadu Trivikram Srinivas
-
థియేటర్లలో మరోసారి అతడు.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్లో ఈ ఏడాది రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న అతడు సినిమా థియేటర్లలో కనువిందు చేయనుంది.ఈ నేపథ్యంలోనే అతడు రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో 2005లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి మహేశ్ బాబు- త్రిష కెమిస్ట్రీని థియేటర్లలో చూసే ఛాన్స్ వచ్చింది. Gun & Bullet rendu chuddam Super 4K lo...vindham Dolby lo 🤌🔥Here comes the #AthaduSuper4K Trailer ▶️ https://t.co/hJrElS0H5d Releasing in theatres as a Superstar @urstrulyMahesh Birthday Special on Aug 9th♥️#AthaduHomecoming#Athadu4KOnAug9th #Athadu4K pic.twitter.com/piO9jrQGfa— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) July 30, 2025 -
డై..లాగి కొడితే....
సినిమా : అతడు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి(త్రిష) అక్కకు పెళ్లి చూపులు జరుగుతుం టాయి. ఆ టైమ్‌లో పూరి తన బావ పార్థసారథి అలియాస్ పార్థు (మహేశ్‌బాబు) రూమ్‌కి వస్తుంది. ‘నువ్వేంటి ఇక్కడ’ అని ప్రశ్నిస్తాడు పార్థు. ‘నువ్వింకా ఎదగాలి పార్థూ! ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్లావు. పక్కనే ఒక బెంజ్ ఉంది. నువ్వు ఏది కొంటావ్? నువ్వు ఒక పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్లావ్.. పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది. నువ్వు ఏది కొంటావ్? ‘అక్క అంబాసిడర్.. నేను బెంజ్. అది పోర్టబుల్ నేను ప్లాస్మా. అది లైఫ్‌బాయ్.. నేను లక్స్’ అందుకే నా అందం దానికి సమస్య కాకూడదని ఇలా వచ్చా’నని సమాధానమిస్తుంది పూరి. అమాయకమైన భావాలతో త్రిష పలికిన ఈ డైలాగ్ మహిళలకూ తెగ నచ్చేసిందనుకోండి.