ఈ సారి బావ హీరోగా సినిమా..! | Dhanush to join hands with Soundarya Rajinikanth for a film? | Sakshi
Sakshi News home page

ఈ సారి బావ హీరోగా సినిమా..!

Jun 18 2016 12:46 PM | Updated on Sep 4 2017 2:49 AM

ఈ సారి బావ హీరోగా సినిమా..!

ఈ సారి బావ హీరోగా సినిమా..!

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సౌందర్య రజనీ కాంత్, కొచ్చాడయాన్ సినిమాతో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో పలుచిత్రాలకు గ్రాఫిక్స్ డిజైనర్ గా...

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సౌందర్య రజనీ కాంత్, కొచ్చాడయాన్ సినిమాతో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో పలు చిత్రాలకు గ్రాఫిక్స్ డిజైనర్ గా పనిచేసిన సౌందర్య, కొచ్చాడయాన్తో నిర్మాత, దర్శకురాలిగానూ మారింది. అయితే ఈ సినిమా నిరాశపరచటంతో మెగాఫోన్ను పక్కనపెట్టి బిజినెస్ పనులు చూస్తూ కాలం గడుపుతోంది.

తాజాగా మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది ఈ స్టార్ వారసురాలు. గతంలో తండ్రి హీరోగా సినిమా తెరకెక్కించిన సౌందర్య, ఈ సారి తన అక్క భర్త, ధనుష్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉందట. అయితే ఈ సినిమాకు కేవలం స్క్రిప్ట్ అందిస్తుందా లేక దర్శకత్వం కూడా తానే చేస్తుందా..? అన్న విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ధనుష్ కూడా ఇప్పట్లో సౌందర్యకు డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్లు చేతిలో ఉన్న ధనుష్, ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ హీరోగా ప్రభు సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొడరి రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement