ధమ్కీ ఇవ్వడం పూర్తయింది | Dhamki Movie updates | Sakshi
Sakshi News home page

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

Jul 21 2019 6:30 AM | Updated on Jul 21 2019 6:30 AM

Dhamki Movie updates - Sakshi

రజిత్, త్రిషాలాషా

రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. సత్యనారాయణ సుంకర నిర్మాత. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ – ‘‘ధమ్కీ’ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే చిత్రమిది. బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ఖర్చుకి వెనకాడకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్, శ్రీమణి సాహిత్యం, మా సినిమాకు ప్లస్‌ అవుతాయి అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు కెమెరా: దీపక్‌ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్‌.

Advertisement
 
Advertisement
Advertisement