breaking news
Rajit
-
జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్ రజిత్‌గుప్తా
సాక్షి, అమరావతి/నరసన్నపేట/పిఠాపురం/బేస్తవారిపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్ సోమవారం ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,80,422 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయగా, 54,378 మంది అర్హత సాధించారు.వారిలో అత్యధికంగా 12,946 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు ఉండటం విశేషం. మొత్తం అర్హత సాధించిన వారిలో 44,974 మంది పురుష అభ్యర్థులు, 9,404 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన రజిత్ గుప్తా కామన్ ర్యాంక్ లిస్టులో జాతీయ స్థాయి టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను అతను 332 మార్కులు సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్‌కు చెందిన దేవదత్త మాఝీ 312 మార్కులతో మహిళల విభాగంలో టాపర్(జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు)గా నిలిచారు.టాప్–10లో ఇద్దరు ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు అర్నవ్ సింగ్ 9వ ర్యాంక్, వడ్లమూడి లోకేష్ 10వ ర్యాంక్ సాధించారు. తొలి రెండు స్థానాలతోపాటు మొత్తం టాప్–10 ర్యాంక్‌లలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు నాలుగు, ఐఐటీ ముంబయి జోన్‌కు మూడు, ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు రెండు, ఐఐటీ కాన్పూర్ జోన్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం జోసా కౌన్సెలింగ్‌కు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్..ఐఐటీ హైదరాబాద్ జోన్ తర్వాత ఢిల్లీ జోన్లో 11,370 మంది, ముంబయి జోన్లో 11,226, రూర్కీ జోన్లో 5,445, ఖరగ్‌పూర్ జోన్లో 5,353, కాన్పూర్ జోన్లో 5,295, గువాహటి జోన్లో 2,743 మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన జోన్లతో పోలిస్తే అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్ జోన్ విద్యార్థులు గణనీయమైన ఫలితాలు సాధించారు.టాప్–10లో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 57 మంది, టాప్–300లో 78 మంది, టాప్–400లో 116 మంది, టాప్–500లో 136 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన వంగల అజయ్‌రెడ్డి, ఓబీసీ–ఎన్సీఎల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి మొదటి ర్యాంకులు పొందారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ టాపర్‌గా అర్నవ్ సింగ్, మహిళల కేటగిరీలో కోరికన రసజ్ఞ (జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్) టాపర్‌గా నిలిచారు.శ్రీకాకుళం జిల్లా విద్యార్థికి ఓబీసీ కేటగిరీ టాప్ ర్యాంక్ జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి ఓబీసీ–ఎన్సీఎల్(నాన్ క్రిమిలేయర్) కేటగిరీలో మొదటి ర్యాంక్ పొందాడు. జనరల్ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకు వచ్చింది. ఓవరాల్‌గా 310 మార్కులు వచ్చాయి. అతనికి జేఈఈ మెయిన్ పరీక్షలో కూడా 99.99 శాతం మార్కులు వచ్చాయి. తమ కుమారుడికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ర్యాంక్ రావడంపై జ్ఞాన రుత్విక్ సాయి తల్లిదండ్రులు ధర్మాన లత, శంకర్ నారాయణ ఆనందం వ్యక్తంచేశారు.దివ్యాంగుల కేటగిరీలో తన్వీకి రెండో ర్యాంక్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన అప్పన రాజరాజేశ్వరి తన్వీ దివ్యాంగుల కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి రాజేష్ పిఠాపురంలో వ్యాపారి. తల్లి సుప్రియ గృహిణి. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, సివిల్స్ సాధించాలన్నదే తన ధ్యేయమని తన్వీ తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురానికి చెందిన మంతు వెంకట రవిచంద్రారెడ్డి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జాతీయ స్థాయి 8వ ర్యాంక్ సాధించాడు. అతని తల్లిదండ్రులు మంతు రాజశేఖరరెడ్డి, వెంకట రత్నాలు సంతోషం వ్యక్తంచేశారు.జాతీయ స్థాయిలో టాప్ 10 అభ్యర్థులుర్యాంకు పేరు జోన్1 రజిత్ గుప్తా (332 మార్కులు) ఐఐటీ ఢిల్లీ2 సక్షం జిందాల్ (332 మార్కులు) ఐఐటీ ఢిల్లీ3 మాజిద్ ముజాహిద్ హుస్సేన్ (330 మార్కులు) ఐఐటీ ముంబయి4 పార్థ్ మందర్ వర్తక్ (327 మార్కులు) ఐఐటీ ముంబయి5 ఉజ్వల్ కేసరి (324 మార్కులు) ఐఐటీ ఢిల్లీ6 అక్షత్ కుమార్ చౌరాసియా (321 మార్కులు) ఐఐటీ కాన్పూర్7 సాహిల్ ముఖేష్ డియో (321 మార్కులు) ఐఐటీ ముంబాయ్8 దేవేష్ పంకజ్ భయ్యా (319 మార్కులు) ఐఐటీ ఢిల్లీ9 అర్నవ్ సింగ్ (319 మార్కులు) ఐఐటీ హైదరాబాద్10 వడ్లమూడి లోకేశ్ (317 మార్కులు) ఐఐటీ హైదరాబాద్జేఈఈ అడ్వాన్స్డ్–2025కి గణాంకాలు ఇలా..జెండర్ నమోదు హాజరు అర్హతపురుషులు 1,43,810 1,39,085 44,974మహిళలు 43,413 41,337 9,404మొత్తం 1,87,223 1,80,422 54,378 -
ధమ్కీ ఇవ్వడం పూర్తయింది
రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. సత్యనారాయణ సుంకర నిర్మాత. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ – ‘‘ధమ్కీ’ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే చిత్రమిది. బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ఖర్చుకి వెనకాడకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, శ్రీమణి సాహిత్యం, మా సినిమాకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్. -
వాస్తవ సంఘటనలతో...
అరే మామా వాడెవడో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడురా ధమ్కీ ఇవ్వాలిరా అంటూ ఉంటాం. రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘ధమ్కీ’. భాస్కరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ సుంకర నిర్మాత. ఏనుగంటి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది. ఆద్యంతం సినిమా అలరిస్తుంది’ అన్నారు. సత్యనారాయణ సుంకర మాట్లాడుతూ– ‘‘ధమ్కీ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ చేస్తాం. సినిమా కథ నచ్చి నిర్మించాను. దర్శకుడు ఏనుగంటి కొన్ని సీన్స్‌ను మెస్మరైజింగ్‌గా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ౖఫైట్స్: రామ్ లక్ష్మణ్, కెమెరా: ఎసి.బి. ఆనంద్. -
తాత - మనవళ్ల కథ
‘‘శ్రీరామరక్ష’ చిత్రం టీజర్ చూస్తుంటే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూస్తున్నప్పటి ఫీలింగ్ కలిగింది. టైటిల్ చక్కగా ఉంది. అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్‌కు శ్రీరాముని ఆశీస్సులుండాలి’’ అని హీరో సునీల్ అన్నారు. రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి ముఖ్య పాత్రల్లో రాము దర్శకత్వంలో వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై ప్రభాత్ వర్మ నిర్మించిన చిత్రం ‘శ్రీరామ రక్ష’. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్‌బాబు, ఓ పాటను సునీల్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తాత- మనవడి బంధం ఇందులో హైలెట్. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి. రంగరాజు. -
‘దశమి’ దర్శకుడి చిత్రం
‘దశమి’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఏనుగంటి చిన్నా ఈసారి కూడా మరో వైవిధ్యభరిత చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్నారు. రజిత్, త్రిషాల్ షా జంటగా శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకంపై శ్రీనివాస చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సరికొత్త కథాంశంతో పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవత్, సంగీతం: సుభాష్ ఆనంద్.