దేవీకి డాన్స్‌ నేర్పుతున్న సితార | Devi Sri Prasad Shares Mahesh Babu Daughter Sitara Dance Video | Sakshi
Sakshi News home page

దేవీకి డాన్స్‌ నేర్పుతున్న సితార

Mar 23 2019 11:40 AM | Updated on Apr 7 2019 12:28 PM

Devi Sri Prasad Shares Mahesh Babu Daughter Sitara Dance Video - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గారాలపట్టి సితార ఇప్పటికే స్టార్‌గా మారింది. పాటలు పాడుతూ, డాన్స్‌ చేస్తూ సోషల్‌ మీడియా ఆడియన్స్‌ను అలరిస్తోంది ఈ లిటిల్‌ స్టార్‌. ఇటీవల బాహుబలి సినిమాలో మురిపాలా ముకుంద పాటకు సితార డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డాన్స్‌ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది సితార పాప.

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ కొత్త వీడియోనే షేర్‌ చేశాడు. శ్రీమంతుడు సినిమాలోని పాటను దేవీ ఆలపిస్తుండగా సితార డాన్స్‌ తన స్నేహితురాలు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేశాడు దేవీ. ఈ వీడియోతో పాటు జూనియర్‌ మహర్షి (సితార) తనకు డాన్స్‌ చేయటం నేర్పిస్తోంది అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ సితార, ఆద్యాలతో కలిసి దిగిన ఫోటోలను వీడియోలను షేర్‌ చేశాడు దేవీ.

ప్రస్తుతం మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాకు దేవీ శ్రీ ప్రసాదే సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్‌ సింగిల్‌ మార్చి 29న విడుదల చేయనున్నారు.పీవీపీ, దిల్‌ రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండా అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement