కళ్లు తిప్పుకోలేక పోతున్నాం.. దిష్టి చుక్క పెట్టండి | Deepika Padukone Ranveer Singh Reception At Bangalore | Sakshi
Sakshi News home page

Nov 22 2018 9:14 AM | Updated on Nov 22 2018 9:28 AM

Deepika Padukone Ranveer Singh Reception At Bangalore - Sakshi

అసమానం, అవాస్తవం, కానీ ఇది వాస్తవం దీపికా పదుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ మిమ్మల్ని చూసి కళ్లు​తిప్పుకోలేకపోతున్నాం.. ఎవరైనా వారికి దిష్ట చుక్క పెట్టండి అంటూ ట్వీట్‌ చేశారు నటి శిల్పాశెట్టి.  ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలో కొంకణీ, సింధీ సంప్రదాయాల్లో వివాహమాడిన ఈ జంట మంగళవారం బెంగళూరు చేరుకుంది.  బుధవారం రాత్రి బెంగళూరులో రిసెప్షన్‌ని ఏర్పాటు చేశారు దీప్‌వీర్‌లు. స్థానిక లీలా ప్యాలేస్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు దీప్‌వీర్‌ బంధుమిత్రులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కలిసి దాదాపు 1000 మంది అతిథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలను దీప్‌వీర్‌లు తమ అభిమానులతో పంచుకున్నారు. బంగారు వర్ణపు పట్టు చీరలో దీపికా అపరంజి బొమ్మలా మెరిసిపోతుండగా.. నలుపు రంగు షేర్వాణీ ధరించిన రణ్‌వీర్‌ కపూర్‌లో రాజసం ఉట్టిపడుతుంది. ఈ ఫోటోలు అభిమానులనే కాకా బాలీవుడ్‌ జనాలను కూడా ఫిదా చేశాయి. వేదిక మీదకు వచ్చే సమయంలో రణ్‌వీర్‌ తన భార్య చీర కొంగును సరి చేస్తూ ఉండగా తీసిన ఫోటో హైలెట్‌గా నిలిచింది. రణ్‌వీర్‌ మీరు పర్ఫేక్ట్‌ హస్బెండ్‌కి ఉదాహరణగా నిలిచారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement
 
Advertisement
Advertisement