హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న దీపిక | Deepika Padukone missed Fast & Furious 7 for Shah Rukh Khan? | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న దీపిక

Sep 17 2013 12:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న దీపిక - Sakshi

హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న దీపిక

బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హాలీవుడ్లో అరంగ్రేటం చేసే అవకాశాన్ని వదులుకుంది.

బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హాలీవుడ్లో అరంగ్రేటం చేసే అవకాశాన్ని వదులుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘విన్ డీసెల్ ఫ్రాంచైజ్’ నిర్మిస్తున్న ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె హాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ సినిమాలో నటించడం ఖాయమని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. 

ఈనెల 10 నుంచి డేట్స్ కావాలని నిర్మాతలు అడిగారు. అయితే ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో ' హ్యేపీ న్యూ ఇయర్' సినిమాలో దీపిక నటిస్తోంది. అంతేకాకుండా సంజయ్లీలా భన్సాలీ 'రామ్ లీలా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుంది. దీంతో ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ అవకాశాన్ని వదులుకుంది. దీపిక పదుకొనే హాలీవుడ్ అవకాశం వదులుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement