పసందుగా పదేళ్లు! | Deepika Padukone and Farah Khan seek blessings at Tirupati temple | Sakshi
Sakshi News home page

పసందుగా పదేళ్లు!

Nov 12 2017 12:57 AM | Updated on Nov 12 2017 12:57 AM

Deepika Padukone and Farah Khan seek blessings at Tirupati temple - Sakshi

... కంప్లీట్‌ అయ్యాయి... హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఫరా ఖాన్‌ దర్శకత్వంలో షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా ఈ సొట్టబుగ్గల సుందరి హిందీ తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఈ సౌత్‌ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. 2007 నవంబర్‌ 9న ఆ చిత్రం విడుదలైంది. హీరోయిన్‌గా పదేళ్లు కెరీర్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దీపిక తిరుపతి వెళ్లారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందారు. దీపిక తిరుమల వెళ్లిన ఫొటోను ఇన్‌సెట్‌లో చూడొచ్చు. తిరుపతిలోని పద్మావతి టెంపుల్‌ని కూడా సందర్శించారామె.

లేటెస్ట్‌గా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ ముఖ్యపాత్రల్లో రూపొందిన ‘పద్మావతి’ని డిసెంబర్‌ 1న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. పద్మావతి పేరుతో సినిమా చేశారు కాబట్టి, ప్రత్యేకంగా ఆ అమ్మవారి గుడికి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే... గడచిన పదేళ్లలో  ‘లవ్‌ ఆజ్‌ కల్, హౌస్‌ఫుల్, రేస్‌ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, పీకూ, బాజీరావ్‌ మస్తానీ’ వంటి హిట్‌ చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ‘ట్రిపులెక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. రణబీర్‌ కపూర్‌తో లవ్, బ్రేకప్‌ తర్వాత కొంత డిప్రెషన్‌కి గురయ్యారు. ఆ సమయంలో సైకాలజిస్ట్‌ని కలసి, డిప్రెషన్‌ నుంచి బయటపడ్డారు. ఏమైతేనేం.. ప్రొఫెషనల్‌గా... పర్సనల్‌గా ఇప్పుడు దీపిక మంచి స్పేస్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement