టెస్ట్‌ పెట్టుకుంటా | A Dearth Of Good Opportunities In Bollywood | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ పెట్టుకుంటా

Apr 29 2019 1:49 AM | Updated on Apr 29 2019 1:49 AM

A Dearth Of Good Opportunities In Bollywood - Sakshi

మహేశ్‌బాబు ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్‌’ సినిమాల్లో కథానాయికగా నటించిన కృతీసనన్‌ గుర్తుండే ఉంటారు. సౌత్‌కు కాస్త దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి అవకాశాలనే చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు హీరోయిన్‌ పాత్రలు చేసిన ఈ బ్యూటీ చాన్స్‌ వస్తే విలన్‌గా నటించడానికి రెడీ అంటున్నారు. ‘‘సినిమాల ధోరణి ఇప్పుడు మారుతోంది. మంచి కథలు, విభిన్నమైన చిత్రాలు మాత్రమే వెండితెరపైకి వస్తున్నాయి. నా కెరీర్‌లో ఇప్పటివరకు అన్నీ పాజిటివ్‌ క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు విలన్‌ పాత్రలు చేయాలనుకుంటున్నాను. నటిగా ప్రేక్షకులకు నన్ను మరింత ప్రూవ్‌ చేసుకోవాలి. అలాగే నెగటివ్‌ పాత్రలకు నేనెంత న్యాయం చేస్తాననే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ పాత్రలు ఒప్పుకుని నాకు నేనే టెస్ట్‌ పెట్టుకోవాలని అనుకుంటున్నాను’’ అన్నారు కృతీసనన్‌.

Advertisement
 
Advertisement
Advertisement