మేలో మెలోడీలు | Date fixed for Mahanati audio release | Sakshi
Sakshi News home page

మేలో మెలోడీలు

Apr 26 2018 12:28 AM | Updated on Apr 26 2018 12:28 AM

Date fixed for Mahanati audio release - Sakshi

సమంత, విజయ్‌ దేవరకొండ

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్‌ పోషించారు. సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్‌ బ్యానర్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించారు. ‘మహానటి’ సినిమా ఆడియోను మే 1న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘మూగ మనసులు’కు విశేష స్పందన లభిస్తోంది. మిక్కీ జె.మేయర్‌ కంపోజ్‌ చేసిన పాటలు అలనాటి పాటలకు దీటుగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement