హీరోల్లో ఆ ముగ్గురంటే ఇష్టం

Darshana Banik like to three heros - Sakshi

‘‘నాది కలకత్తా. బెంగాలీలో ఆరు సినిమాలతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లో నటించా. తెలుగులో ‘ఆటగాళ్ళు’ నా తొలి సినిమా’’ అని దర్శనా బానిక్‌ అన్నారు. నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక దర్శనా బానిక్‌ మాట్లాడుతూ– ‘‘గతేడాది బాంబేలో ఓ మ్యూజిక్‌ వీడియోలో యాక్ట్‌ చేశా. ఆ వీడియో కొరియోగ్రాఫర్‌ విష్ణుదేవా నా ఫొటోషూట్‌ పిక్స్‌ని ‘ఆటగాళ్ళు’ చిత్ర దర్శక–నిర్మాతలకి పంపారు. ఆడిషన్స్, రోహిత్‌తో ఫొటోషూట్‌ చేశాక నన్ను ఎంపిక చేశారు.

ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. చాలా ఇండిపెండెంట్, వర్కింగ్‌ లేడీ. సిన్సియర్‌ ప్రేమికురాలు కూడా.  పరుచూరి మురళిగారు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కించారు. నారా రోహిత్, జగపతిబాబుగారు పోటీ పడి నటించారు. బెంగాలీలో అనువాదమైన  ‘మగధీర, ఆర్య, ధృవ, అరుంధతి, బాహుబలి’ సినిమాలు చూశా. ‘బాహుబలి’ బాగా నచ్చింది. హీరోల్లో షారుక్‌ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్‌ అంటే ఇష్టం. డైరెక్టర్స్‌లో  రాజమౌళిగారికి అభిమానిని. తెలుగు సినిమాల బడ్జెట్‌ ఎక్కువ.. బెంగాలీ సినిమాల బడ్జెట్‌ కాస్త తక్కువగా ఉంటుంది. తెలుగు, బెంగాలీ సినిమాలకి అంతే తేడా. ప్రస్తుతం నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. నెక్ట్స్‌ టైమ్‌ తెలుగులోనే మాట్లాడతా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top