పెళ్లి చూపులు అంతటి హిట్‌ అవ్వాలి | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులు అంతటి హిట్‌ అవ్వాలి

Published Thu, Aug 31 2017 11:57 PM

పెళ్లి చూపులు అంతటి హిట్‌ అవ్వాలి

– డి. సురేశ్‌బాబు
‘‘మెంటల్‌ మదిలో’ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. ట్రైలర్‌లో కథ గురించి చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. వివేక్‌ ఆత్రేయ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘పెళ్లి చూపులు’లానే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలి’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’.

ఈ చిత్రం ట్రైలర్‌ను సురేశ్‌బాబు విడుదల చేశారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా క్రేజ్‌ సంపాదించుకొన్న వివేక్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. పాజిటివ్‌ బజ్‌ ఉన్న సినిమా ఇది. మా టీమ్‌ అంతా సినిమా రిజల్ట్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ట్రైలర్‌ రిలీజ్‌  చూసి, మమ్మల్ని సురేశ్‌గారు అభినందించడం హ్యాపీగా ఉంది. త్వరలోనే పాటలను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Advertisement
Advertisement