క్రైమ్ కథ | Crime story | Sakshi
Sakshi News home page

క్రైమ్ కథ

Sep 8 2015 10:46 PM | Updated on Aug 16 2018 4:36 PM

క్రైమ్ కథ - Sakshi

క్రైమ్ కథ

ప్రేమకథ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ‘కదిలే బొమ్మల కథ’. వి.బాలు, ప్రియ. శ్రీతేజ్, అనన్యశెట్టి ముఖ్యపాత్రల్లో శశిధర్ బోయపల్లి

ప్రేమకథ నేపథ్యంలో సాగే  క్రైమ్ థ్రిల్లర్ ‘కదిలే బొమ్మల కథ’. వి.బాలు, ప్రియ. శ్రీతేజ్, అనన్యశెట్టి ముఖ్యపాత్రల్లో శశిధర్  బోయపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్ రావుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను సీనియర్ నటుడు నాజర్, ప్రసాద్‌లు ఆవిష్కరించారు.

నాజర్  మాట్లాడుతూ-‘‘సినిమాల్లో పెద్దా, చిన్నా తేడాలుండవు. అన్నిటిలోనూ రిస్క్ ఒకటే. కథ చెప్పగానే వెంటనే నచ్చింది’’ అని చెప్పారు. ఈ వేడుకలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత బాలసాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement