హీరోగా మారిన క్రికెటర్! | Cricketer turned hero! | Sakshi
Sakshi News home page

హీరోగా మారిన క్రికెటర్!

Jun 21 2015 2:48 PM | Updated on Sep 3 2017 4:04 AM

హీరోగా మారిన క్రికెటర్!

హీరోగా మారిన క్రికెటర్!

బౌలర్‌గా బ్యాట్స్‌మన్‌ను అదరగొట్టిన శ్రీశాంత్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. క్రికెట్ నేపథ్యంలోనే సాగే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో షూటింగ్ జరుపుకుని 14 భాషల్లో అనువాదం కానుంది.

బౌలర్‌గా బ్యాట్స్‌మన్‌ను అదరగొట్టిన శ్రీశాంత్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. క్రికెట్ నేపథ్యంలోనే సాగే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో షూటింగ్ జరుపుకుని 14 భాషల్లో అనువాదం కానుంది.
 
 దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ -‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేశాను. మా నాన్నగారు మలయాళ సినిమాల్లో నటించారు.
 
 మహేశ్‌భట్ తాజాగా నిర్మిస్తున్న ‘క్యాబరే’ చిత్రంలో విలన్‌గా చేస్తున్నా’’ అని చెప్పారు. ‘‘ఓ యువకుడు ప్రేమ కోసం క్రికెటర్‌గా ఎలా ఎదుగుతాడనేది ఈ చిత్రం కథాంశం. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమవుతుందని యాదిరెడ్డి తెలిపారు.
 
Advertisement
 
Advertisement
Advertisement