ఉదయ్కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే | court stays uday kiran's last movie release | Sakshi
Sakshi News home page

ఉదయ్కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే

Jun 25 2015 2:45 PM | Updated on Sep 3 2017 4:21 AM

ఉదయ్కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే

ఉదయ్కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే

దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'కు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి.

దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'కు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. సినిమా విడుదలను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. 'నువ్వునేను' సినిమా హీరోయిన్ అనిత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మోహన్ ఎల్లార్కే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మున్నా నిర్మాత. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.

ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకుంటున్నట్లు ఆ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు అన్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత, దర్శకుడు భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో దీనికి కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు చిత్ర విడుదల అనుమానంలో పడింది.

Advertisement
 
Advertisement
Advertisement