నాని సినిమాకు కరోనా ఫీవర్‌ | Coronavirus Scare: Nani V Movie Release To Be Postponed | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: ‘వి’ చిత్రం వాయిదా!

Mar 13 2020 3:31 PM | Updated on Mar 13 2020 4:09 PM

Coronavirus Scare: Nani V Movie Release To Be Postponed - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’. నివేదా థామస్‌, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మన్‌’ సినిమాల దర్శకుడు మోహన్‌కృష్ణ  ఈ సినిమాతో మరోసారి నానీతో జోడీ కట్టాడు. ఇది నానికి 26వ సినిమా.  ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఈ పాటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశమంతటా కరోనా టెన్షన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ చేస్తే.. వైరస్‌ దెబ్బకు జనాలు థియేటర్‌ వరకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన నాని విలన్‌ లుక్‌, వి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది (అష్టాచమ్మాలో నానికి అవకాశం ఎలా వచ్చిందంటే...)


ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్‌ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని నిర్మాత దిల్‌ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకైనా మంచిదని, కాస్త కరోనా ఫీవర్‌ తగ్గిన తర్వాతే సినిమా విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఉగాదికి కాకుండా మరికొద్ది రోజులు ఆలస్యంగా విడుదల కానుంది. కొత్త రిలీజ్‌ డేట్‌ తెలియాంటే చిత్ర యూనిట్‌ మరో డేట్‌ను ప్రకటించేవరకు ఓపిక పట్టాల్సిందే. కగా ఈ సినిమా నుంచి రిలీజైన ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా..’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటను అమిత్‌ త్రివేది, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. (నాని విలన్‌ లుక్‌!)

Advertisement
 
Advertisement
Advertisement