నాని విలన్‌ లుక్‌! | Nani Joins V Movie Shooting | Sakshi
Sakshi News home page

నాని విలన్‌ లుక్‌!

Aug 11 2019 11:07 AM | Updated on Aug 11 2019 12:16 PM

Nani Joins V Movie Shooting - Sakshi

ఇప్పటికే విభిన్న పాత్రలతో నేచురల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని తన 25వ సినిమాలో మరో ప్రయోగం చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్‌ పనుల్లో బిజీగా ఉన్న నాని, వి సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు.

ఆదివారం వి షూటింగ్‌కు హాజరయ్యాడు నాని. ఈ సినిమాలో నాని లుక్‌ సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తుండగా అదితిరావ్‌ హైదరీ, నివేదా థామస్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైరా ఫేం అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా నాని గ్యాంగ్‌ లీడర్‌ సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement