సమాజసేవలో మెగాస్టార్‌ తల్లి

Coronavirus: Chiranjeevi Mother Make Masks for the Needy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ కరోనాను ఎదుర్కొనేందుకు మానవత్వాన్ని చూపుతూ ముందుకు వస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై పోరులో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు)


మాస్కులు తయారు చేసిన కిషన్‌రెడ్డి భార్య
సాక్షి, న్యూఢిల్లీ: తన సతీమణి కావ్య మాస్కులు తయారుచేసి, వాటిని పంపిణీ చేసిన చిత్రాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తన సతీమణి సమయాన్ని సద్వినియోగం చేస్తూ, ఇంట్లోనే మాస్కులు తయారు చేసి, వాటిని అవసరం ఉన్నవారికి అందించారని తెలిపారు. ఈ ట్వీట్‌కు కేంద్ర మంత్రులు ప్రకాష్‌ జవదేకర్, బాబుల్‌ సుప్రియో, అనురాగ్‌ ఠాకూర్, కిరెన్‌ రిజీజు, బాలీవుడ్‌ నటులు అనుపమ్‌ ఖేర్, అక్షయ్‌ కుమార్, కవి కుమార్‌ విశ్వాస్, ఢిల్లీకి చెందిన సీనియర్‌ జర్నలిస్టు, ఇండియా టుడే ఎడిటర్‌ గౌరవ్‌ సావంత్, టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పవన్‌ కళ్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్, సమంతను ట్యాగ్‌ చేశారు. ఇలాగే ప్రతి కుటుంబం తమకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. భార్య విలవిలలాడుతుంటే తట్టుకోలేక..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top