ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య | Corona: Aishwarya Rai And Daughter Aaradhya Admitted To Nanavati Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య

Jul 18 2020 8:02 AM | Updated on Jul 18 2020 12:59 PM

Corona: Aishwarya Rai And Daughter Aaradhya Admitted To Nanavati Hospital - Sakshi

ముంబై : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఐశ్వర్యరాయ్‌(46), ఆమె కుమార్తె ఆరాధ్య(8) శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. వైరస్‌ లక్షణాలు స్పల్పంగా కనిపించడంతో నిన్న సాయంత్రం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈనెల 12 ఐశ్వర్యర్యాయ్‌, ఆరాధ్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో గత అయిదు రోజులుగా వైద్యుల సూచనతో వారు ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్)

మరోవైపు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కొడుకు సైతం జూలై 11న కరోనా బారిన పడి నానావతి  ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  కరోనా తేలినప్పటి నుంచి బిగ్‌బీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఆరోగ్య సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అభిమానులు, సన్నిహితులందరికి బిగ్‌బీ  ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. (కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్‌ ట్వీట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement