నమ్మకం నిలబెట్టుకుంటా! | Continues to believe! | Sakshi
Sakshi News home page

నమ్మకం నిలబెట్టుకుంటా!

Jun 10 2015 10:57 PM | Updated on Sep 3 2017 3:31 AM

నమ్మకం నిలబెట్టుకుంటా!

నమ్మకం నిలబెట్టుకుంటా!

‘‘ఎనిమిదేళ్ళుగా కమల్‌హాసన్‌గారి దగ్గర పనిచేస్తున్నా. నాతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన నాకే ఈ చిత్ర దర్శకత్వ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాజేశ్ అన్నారు.

‘‘ఎనిమిదేళ్ళుగా కమల్‌హాసన్‌గారి దగ్గర పనిచేస్తున్నా. నాతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన నాకే ఈ చిత్ర దర్శకత్వ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాజేశ్ అన్నారు.  రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పతాకంపై కమల్‌హాసన్, ప్రకాశ్‌రాజ్, త్రిష, మధుశాలిని ముఖ్య పాత్రల్లో రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చీకటి రాజ్యం’.
 
 ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. దర్శకుడు రాజేశ్ మాట్లాడుతూ -‘‘మొదటి సినిమాతోనే అగ్ర నటులతో పనిచేయడం ఆనందంగా ఉంది. నటీనటులు, సాంకేతిక బృందాన్ని నేనే ఎంపిక చేసుకున్నాను. కమల్‌గారికి నా మీద ఉన్న నమ్మకం అలాంటిది. యాక్షన్ చెప్పాక,  నటించి వెళ్లిపోతారు.
 
 ఇక నాకు ఏదైనా సన్నివేశం సరిగ్గా రాలేదనిపించి అడిగితే ఎన్నిసార్లయినా చేస్తారు. ఈ సినిమా రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. యాక్షన్ సన్నివే శాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. అందుకే అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్స్‌తో పనిచేస్తున్నాం. నా మీద చాలా నమ్మకంతో కమల్‌హాసన్‌గారు నాకు దర్శకత్వ బాధ్యత అప్పగించారు. కచ్చితంగా నిలబెట్టుకుంటాను’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement