డబ్బు సంపాదించే సమయం కాదు | Comedian Ali Emotional On Coronavirus | Sakshi
Sakshi News home page

డబ్బు సంపాదించే సమయం కాదు

Mar 25 2020 7:02 AM | Updated on Mar 25 2020 7:02 AM

Comedian Ali Emotional On Coronavirus - Sakshi

‘‘కరోనా వైరస్‌ పైకి వెళ్లిపోవాలని కోరుతూ గత పదిరోజులుగా ఇంట్లోనే ఉంటూ నమాజ్‌ చేస్తున్నా. చాలా మంది తిండి లేక, డబ్బుల్లేక బాధపడుతుంటారు.. కానీ తప్పదు. ఈ వ్యాధి అలాంటిది. ఇటలీలో ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారి మృతదేహాలను తీయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.  ప్రభుత్వాలకు, పోలీసులకు సహకరించాలి’’ అన్నారు అలీ. కరోనా కట్టడి సహాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లక్ష రూపాయలు, తెలంగాణ ప్రభుత్వానికి లక్ష రూపాయలు సాయం ప్రకటించారు.

‘‘భారతదేశంలో చాలా మంది గొప్పోళ్లు ఉన్నారు.. ఈ సమయంలో వారు కూడా సాయం చేస్తే చాలా మంచిది.. ఈ వైరస్‌పై ఎవరూ కామెంట్స్‌ చేయొద్దు.. కామెడీ చేయొద్దు. ఈ సమయంలో చాలా మంది రేట్లు పెంచి డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు.. ఇది సంపాదించే సమయం కాదు.. మానవత్వం చూపాల్సిన  సమయమిది. ఎంత రేటు ఉంటే అంతకే అమ్మండి’’ అన్నారు అలీ. ‘3జి లవ్‌’ చిత్రనిర్మాత ప్రతాప్‌ కోలగట్ల కరోనా కట్టడి సహాయ కార్యక్రమాల కోసం ఏపీ ప్రభుత్వం సహాయ నిధికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement