చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది..? | Chiranjeevi Surender Reddy movie halted | Sakshi
Sakshi News home page

చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది..?

Dec 15 2016 1:37 PM | Updated on Sep 4 2017 10:48 PM

చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది..?

చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధృవ. తమిళ సినిమా తనీ ఒరువన్కు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధృవ. తమిళ సినిమా తనీ ఒరువన్కు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా తెరకెక్కించటంలో విజయం సాధించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అందుకే సూరి వర్కింగ్ స్టైల్, టేకింగ్ నచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తారన్న ప్రచారం జరిగింది.

ఈ ప్రచారం ధృవ కలెక్షన్లకు కూడా ప్లస్ అయ్యింది. ఆశించినట్టుగా ధృవ మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ మెగాస్టార్ తో సురేందర్ రెడ్డి సినిమా మాత్రం వాయిదా పడింది. ధృవ తరువాత అంతా కొత్త వారితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ తో సినిమా ఉంటుందని కాని ఏది ఎప్పుడు అన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. నిజంగానే చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా..? లేక ధృవ ప్రమోషన్ కోసం ఇలాంటి టాక్ సృష్టించారా.. అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement