చిరంజీవి @ 41 | chiranjeevi 41 years completed in telugu film industry | Sakshi
Sakshi News home page

చిరంజీవి @ 41

Sep 23 2018 12:08 AM | Updated on Sep 23 2018 1:23 AM

chiranjeevi 41 years completed in telugu film industry - Sakshi

చిరంజీవి, రామ్‌చరణ్‌

దాదాపు నెల రోజుల పాటు జార్జియాలో యుద్ధం చేయనున్నారు ‘సైరా’. చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా’. చిరంజీవి తనయుడు హీరో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కోసం యూనిట్‌ జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం మొదలయ్యే ఈ షెడ్యూల్‌ వచ్చే నెల 25వరకు.. అంటే దాదాపు నెల రోజులు జరుగుతుందని సమాచారం. ఒకే సీక్వెన్స్‌కు చెందిన క్లైమాక్స్‌ వార్‌ను షూట్‌ చేస్తారు.

ఈ షూట్‌లో చిరంజీవి, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్, ముఖేష్‌ రిషిలు పాల్గొంటారు. ఆల్రెడీ జగపతిబాబు, ముఖేష్‌ రిషి లొకేషన్‌లో ల్యాండ్‌ అయ్యారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమి తాబ్‌ బచ్చన్, తమన్నాలు  కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో 41ఇయర్స్‌ కంప్లీట్‌ చేసుకున్నారు. అందుకుని ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ‘‘సినిమా, నేను మిమ్మల్ని ఎప్పుడూ లవ్‌ చేస్తూనే ఉంటాం’’ అని స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement