ఆ జీవితమంతా శూన్యమే:ఏంజలీనా జోలీ | Children have softened me, says Angelina Jolie | Sakshi
Sakshi News home page

ఆ జీవితమంతా శూన్యమే:ఏంజలీనా జోలీ

May 30 2014 3:59 PM | Updated on Sep 2 2017 8:05 AM

ఆ జీవితమంతా శూన్యమే:ఏంజలీనా జోలీ

ఆ జీవితమంతా శూన్యమే:ఏంజలీనా జోలీ

హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ జీవితం కూడా అచ్చం సినిమా కథనే తలపిస్తోంది.

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ జీవితం అచ్చం సినిమా కథనే తలపిస్తోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం.. ముగ్గురు భర్తలతో వైవాహిక జీవితం.. ఆరుగురు పిల్లలకు జీవితాన్ని ఇవ్వడం.. ఆపై బోయ్ ఫ్రెండ్ బ్రాడ్ పిట్ తో డేటింగ్..  తదుపరి కేన్సర్ బారిన పడటం..ఇలా చెప్పకుంటూ పోతే ఆమె జీవితమే ఒక పుస్తకం మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం నాలుగు పదుల జీవితానికి దగ్గర పడుతున్న జోలీ జీవితంలో అన్నీ మలుపులే. ఆమె జీవితంలో ఎన్ని ఆటుపోట్లును చవిచూసినా.. కేన్సర్ బారిన పడ్డ క్షణాలే ఆమెకు అత్యంత దుర్భరమైనవిగా పేర్కొంటుంది. ' ఆ క్షణంలో నేను శూన్యంలోకి వెళ్లిపోయాను. నాపై నాకే అసహ్యం వేసేది. తరుచు ఎక్కువగా కోప్పడుతూ ఉండేదాన్ని. దాన్ని తలుచుకుంటేనా భయమేస్తోంది. ఆ గతమంతా చీకటే.  ఆ ప్రయాణాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాను' అని జోలీ తెలిపింది.

 

కొన్ని సందర్భాల్లో చనిపోవడానికి కూడా యత్నించానని తెలిపింది. విమానాల నుంచి దూకాలనిపించడమే కాకుండా, ఇంట్లో ఉన్న సమయంలో జీవితాన్ని అంతం చేసుకోవాలని ఆలోచనలే తనలో తరచు కలిగేవని తెలిపింది. 2007 లో ఆమె తల్లి కూడా కేన్సర్ తోనే చనిపోవడం కూడా తనను తీవ్రంగా కలిచి వేసేదని పేర్కొంది. ఆ చీకటి జీవితం నుంచి బయటకు రావడానికి తనకున్న ఆరుగురు పిల్లలే కారణం అంటోంది. గత సంవత్సరం కేన్సర్ బారిన పడిన తాను తిరిగి కోలుకోవటానికి పిల్లల ఓదార్పే ఆసరా అయ్యిందని తెలిపింది.

 

Advertisement
 
Advertisement
Advertisement