నేను డబుల్‌ మాస్‌ | Check Out the Trailer of Kanchana 3 | Sakshi
Sakshi News home page

నేను డబుల్‌ మాస్‌

Mar 29 2019 3:10 AM | Updated on Mar 29 2019 3:10 AM

 Check Out the Trailer of Kanchana 3 - Sakshi

సుధాకర్‌ రెడ్డి, లారెన్స్, ‘ఠాగూర్‌’ మధు

‘నాకేమైనా అయినా వదిలేస్తా.. మా వాళ్లకేమైనా అయితే నరికి పారేస్తాన్రా’ అని హీరో అంటే, ‘నువ్వు ఉన్న చోటు తెలియకుండా అంతం చేసేస్తా’ అని విలన్‌ అంటాడు. ‘నిప్పుని కూడా తాకొచ్చురా నలుపుని తాకొద్దు’ అని హీరో రాఘవ లారెన్స్‌ డైలాగ్‌ చెబితే, ‘నువ్వు నా మాస్‌ తెలీకుండా మాట్లాడుతున్నావ్‌’ అని విలన్‌ వార్నింగ్‌ ఇస్తాడు. ‘నువ్వు మాస్‌ అయితే నేను డబుల్‌ మాస్‌’ అని లారెన్స్‌ చెబుతున్న డైలాగ్‌తో ‘కాంచన 3’ ట్రైలర్‌ సాగుతుంది. రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’.

ఓవియా, వేదిక కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. తెలుగులో లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై రాఘవ లారెన్స్‌ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం రిలీజ్‌ చేశారు. ‘‘కాంచన సిరీస్‌లో మూడు భాగాలను హిట్‌ చేశారు. ఇప్పుడు ‘కాంచన 3’ని కూడా ఆదరిస్తే ఓ పది భాగాలు తీయాలని ఉంది. నన్ను పెద్ద డ్యాన్స్‌ మాస్టర్‌ని చేసిన చిరంజీవిగారు హీరోగా ఓ సినిమా డైరెక్ట్‌ చేయాలని ఉంది. అలాగే నన్ను దర్శకుడిని చేసిన నాగార్జునగారితో మళ్లీ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు లారెన్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement