‘చార్లీ చాప్లిన్‌’ సీక్వెల్‌లోనూ ఆ ఇద్దరే! | charli chaplin sequel | Sakshi
Sakshi News home page

Dec 16 2017 7:21 PM | Updated on Aug 13 2018 4:19 PM

charli chaplin sequel - Sakshi

సినిమాలకు ఇపుడంతా సీక్వెల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. హాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉన్నా అది ఇటీవల  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లకూ పాకింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ అధికం అనే చెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 2.ఓ, కలగలప్పు 2, తమిళ పడం 2 ఈ తరహా చిత్రాలే. వీటికి తొలి భాగాలు మంచి విజయాన్ని పొందడంతో రెండవ భాగాలకు రెడీ అయ్యాయి. అలా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం చార్లీచాప్లిన్‌ 2. 2002లో ప్రభు, ప్రభుదేవా, గాయత్రి రఘురామ్, అభిరామిలు కలిసి నటించిన చార్లీచాప్లిన్‌ మంచి విజయాన్ని సాధించింది. దాని దర్శకనిర్మాత శక్తి ఎన్‌.చిదంబరం తాజాగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా ప్రభుదేవానే నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి ఎంపికయ్యింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌ను ఈ నెల 15 నుంచి జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా, తొలి భాగంలో నటించిన ప్రభు పాత్రలో ఎవరు నటిస్తారన్న సస్పెన్స్‌ కొనసాగుతున్న తరుణంలో తాజాగా ఇందులోనూ ప్రభు నటించనున్నారని చిత్రవర్గాలు వెల్లడించాయి. తమ చిత్రంలో ఆయన నటించడం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు అన్నారు. అయితే హీరో పాత్రలను దాటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ప్రభు ఇందులో ఏ తరహా పాత్రను పోషిస్తున్నారన్న విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే ప్రభు చార్లీచాప్లిన్‌ చిత్రంలో పోషించిన పాత్రకు కొనసాగింపుగానే ఈ చిత్రంలోనూ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ప్రభు హీరోగా రెండవ ఇన్నింగ్‌ మొదలెట్టినట్లే అవుతుంది.

  

Advertisement
 
Advertisement
Advertisement