తియ్యని అనుభూతి! | chandrullo unde kundelu movie audio released | Sakshi
Sakshi News home page

తియ్యని అనుభూతి!

Mar 12 2016 11:14 PM | Updated on Sep 3 2017 7:35 PM

తియ్యని అనుభూతి!

తియ్యని అనుభూతి!

చంద్రుళ్లో ఉండే కుందేలు.. కిందకొచ్చిందా? కిందకొచ్చి నీలా మారిందా? అంటూ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో త్రి

చంద్రుళ్లో ఉండే కుందేలు.. కిందకొచ్చిందా? కిందకొచ్చి నీలా మారిందా? అంటూ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో త్రిష కోసం సిద్ధార్ధ్ పాడిన పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ పాటను గుర్తు చేయడానికి కారణం.. ‘చుంద్రుళ్లో ఉండే కుందేలు’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్ ముఖ్యతారలుగా శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ పతాకంపై వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ- ‘‘కళలు మానవ జీవితంలో భాగం.
 
 కళలు లేకుంటే మానవ జీవితం విస్తారమవుతుంది. చలన చిత్ర రంగం విజ్ఞానాన్ని, వినోదాన్ని, సందేశాన్ని అందిస్తున్నాయి.  ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘తియ్యని అనుభూతికి గురి చేసే చిత్ర ఇది. మంచి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శక- నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, దర్శకుడు సముద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: విశ్వనాథ్.
 

Advertisement
 
Advertisement
Advertisement