ఛల్‌ మోహన్‌రంగ టీజర్‌ విడుదల | chal mohana ranga teaser released | Sakshi
Sakshi News home page

ఛల్‌ మోహన్‌రంగ టీజర్‌ విడుదల

Feb 14 2018 9:37 AM | Updated on Aug 9 2018 7:30 PM

chal mohana ranga teaser released - Sakshi

సాక్షి, సినిమా : ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్‌ హీరో నితిన్‌ అభిమానులకు గిప్ట్‌ ఇచ్చాడు. తన కొత్త చిత్రం 'ఛల్‌ మోహన్‌రంగ' టీజర్‌ను విడుదల చేశాడు. టీజర్‌లో తన ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు నితిన్‌. 'వర్షాకాలం కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని.. వేసవికాలంలో విడిపోయాం' అంటూ తన లవ్‌స్టోరిని చెప్పకనే చెప్పాడు. ఈ టీజర్‌లో నితిన్‌ కూల్‌ లుక్‌ తోపాటు, మేఘా ఆకాశ్‌ అందంగా కనిపిస్తోంది.

కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రేష్ట్‌ మూవీస్, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నితిన్‌కు కెరీర్‌లో 25వ సినిమా. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. తమన్ సంగీతం దర్శకుడుగా పనిచేస్తున్నారు. కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, సమర్పణ: నిఖిత రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement