చల్‌ మోహన్‌ రంగా ట్రైలర్‌ | Chal Mohan Ranga Theatrical Trailer Released | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్‌ సిస్టర్‌లా ఉన్నావ్..!

Mar 25 2018 9:15 PM | Updated on Mar 25 2018 11:20 PM

Chal Mohan Ranga Theatrical Trailer Released - Sakshi

చల్‌ మోహన రంగా చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌లోని ఓ షాట్

సాక్షి, హైదరాబాద్‌ : ఎలా ఉన్నానండీ.. సన్నీలియోన్‌ సిస్టర్‌లా ఉన్నావ్‌..!! ఏంటోనండీ అంతా మీ అభిమానం గొప్పగొప్పవాళ్లతో పోల్చేస్తున్నారు. ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు అనే డైలాగ్స్‌తో చల్‌ మోహన్‌ రంగా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. పూర్తి స్థాయి లవ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

చాక్‌లెట్‌ బాయ్‌ లుక్‌లో హిరో నితిన్‌ ట్రైలర్‌లో మంచి జోష్‌ను కనబరిచారు. నితిన్‌, మేఘా ఆకాశ్‌లు జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. తన ట్రేడ్‌ మార్క్‌ మాటలతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి కథ అందించారు. మరి మీరు ఓ సారి ట్రైలర్‌ను చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement