క్యూట్‌ కిడ్స్‌ @ ఫొటో ఫ్రేమ్స్‌

Celebrities Like Smaritha Born Baby Photography Hyderabad - Sakshi

ఫొటోగ్రఫీతో ఆకట్టుకుంటున్న స్మరిత

పలువురు సెలబ్రిటీల ఫిదా

శ్రీనగర్‌కాలనీ:  యూకేలో ఎంఎస్, యూఎస్‌ఏలో కుటుంబంతో సెటిల్‌ అయ్యింది. కానీ ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఆమెకు ప్రాణం. ఆ ఇష్టంతోనే న్యూ బార్న్‌ ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకుంది. అమెరికాలో ఆమె పోటోలకు ఫిదా అయిన అనేక మంది హైదరాబాద్‌ రావాలని పట్టుబట్టడంతో సిటీకి వచ్చి న్యూబార్న్‌ పొటోగ్రఫీలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుతుంది నగరానికి చెందిన స్మరిత విన్నకోట. ఇక్కడే ఇంజనీరింగ్‌ చదివిన స్మరిత సెలబ్రిటీస్‌ పిల్లలకు పొటోగ్రఫీ చేసి వారి మన్ననలు పొందుతూ న్యూ బార్న్‌ ఫొటోగ్రఫీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. తన గురించి, ఫొటోగ్రఫీ విషయాలను సాక్షికి వివరించింది. 

పిల్లలంటే ఇష్టం..
నగరానికి చెందిన అమ్మాయినే..జేబీఐటీలో ఇంజనీరింగ్‌ చేశాను. తర్వాత యూకేలో ఎంఎస్‌ చేశాను. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు పొటోలను తీసేదాన్ని. పెళ్ళయ్యాక భర్త నవీన్‌తో కలిసి యూఎస్‌ఏలో సెటిలయ్యాం. కానీ ఎక్కడో వెళితిగా ఉండేది. ఫొటోగ్రఫీ చేయాలని గట్టిగా అనుకున్నాను. అందులోనూ న్యూ బార్న్‌ చిన్నారులకు ఫొటోగ్రఫీ చేయాలనుకున్నాను. ఆన్‌లైన్‌లో కోర్సులను, బేబీ సేఫ్టీ వర్క్‌ షాప్‌ నేర్చుకున్నాను. యూఎస్‌లో ఇంటర్నేషనల్‌ న్యూ బార్న్‌ ఫొటోగ్రఫీలో మెంబర్‌ని. బ్యూటీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ మామీ మ్యాగ్జీన్‌– పేరెంట్స్‌ ఛాయిస్‌ అవార్డు లభించింది. అలా న్యూ బార్న్‌ ఫొటోగ్రఫీ నాకు మరో భాగస్వామిగా మారింది. 

జస్ట్‌ బార్న్‌ ఫొటోగ్రఫీకి మంచి రెస్పాన్స్‌

2014 నుండి న్యూ బార్న్‌ ఫొటోగ్రఫీ చేస్తున్నాను. పుట్టిన 14 రోజుల్లో జస్ట్‌బార్న్‌ ఫొటోగ్రఫీ చేయాలి. యూఎస్‌లో ఈ ఫొటోగ్రఫీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అక్కడి ఇండియన్స్‌తో పాటు విదేశీయులు సైతం జస్ట్‌బార్న్‌ ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు. అలా అక్కడ ఫొటోగ్రఫీకి చాలా అద్బుతమైన స్పందన వచ్చింది. మన తెలుగువారు చాలా మంది హైదరాబాద్‌ నుండి మెయిల్స్, సోషల్‌మీడియాలో మెసేజెస్, ఫోన్లు చేసి ఇక్కడి రావాలని పట్టుబట్టారు. కొంత మంది సెలబ్రిటీస్‌ ఫొటోగ్రఫీకి కితాబివ్వడం ఆనందాన్నిచ్చేది. సుమారుగా 500 న్యూబార్స్‌ బేబీస్‌కి ఫొటోగ్రఫీ చేశాను. అలా సొంత నగరానికి రావాల్సి వచ్చింది. 

ప్రముఖుల పిల్లలకు ఫొటోలు

బేబీ బార్న్‌ ఫొటోగ్రఫీని నగరంలోని చాలా మందికి చేశాను. అందులో మంచు విష్ణు కుమార్తె, మెగాస్టార్‌ మనవరాలు, శ్రీజ–కళ్యాణ్‌దేవ్‌ కుమార్తెకు, దిల్‌రాజు మనవరాలికి, అశ్వనీదత్‌ మనవరాలికి బేబీ బార్న్‌ ఫొటోగ్రఫీ చేశాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top