హరికృష్ణ మృతితో.. దిగ్ర్భాంతిలో టాలీవుడ్‌

Cebreties Condolence To Nandamuri Harikrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. ‘కొన్ని వారాల క్రితమే ఆయన నాతో.. నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఇక లేరు. మిస్‌ యూ అన్న’ అంటూ హీరో నాగార్జున ట్విటర్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. సీతారామరాజు చిత్రంలోని ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ, నాగర్జున అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే.

  • ఈ వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.- కాజల్‌
  • నందమూరి హరికృష్ణ గారి మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- అల్లరి నరేష్‌
  • ఈ రోజు నిద్రలేవగానే ఇంత ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. ఇది నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌తోపాటు కుటుంబసభ్యులందరికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలి- సుధీర్‌ బాబు
  • హరికృష్ణ గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.- సాయిధరమ్‌ తేజ్‌
  • ఇది నమ్మశక్యంగా లేదని డైరక్టర్‌ హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
  • హరికృష్ణ గారి గురించి ఇలాంటి వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు.  ఆ భగవంతుడు కుటుంబసభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.- దేవీశ్రీ ప్రసాద్‌
  • ఈ వార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. - మంచు లక్ష్మీ
  • ఈ వార్త వినడం చాలా బాధకరంగా ఉంది. నందమూరి కుటుంబసభ్యులకు నా సంతాపన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని కోరుకుంటున్నాను- అల్లు శిరీష్‌
  • ఈ వార్త విని షాక్‌కు గురయ్యాను. నాకు మాటలు రావడం లేదు. దేవుడు కఠినమైనవాడు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను- మంచు మనోజ్‌
  • ఈ వార్త నన్న షాక్‌కు గురిచేసింది. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటు. ఆయన మంచి వ్యక్తి, గొప్ప తండ్రి. నా బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఇది విషాదకరమైన రోజు -కోన వెంకట్‌
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top