థ్రిల్ చేస్తా! | Calling Bell Telugu Horror Movie | Sakshi
Sakshi News home page

థ్రిల్ చేస్తా!

Mar 31 2015 11:55 PM | Updated on Sep 2 2017 11:38 PM

థ్రిల్ చేస్తా!

థ్రిల్ చేస్తా!

నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నా మొదటి సినిమాకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా’’ అని చెప్పారు ‘కాలింగ్ బెల్’ దర్శకుడు పన్నా రాయల్.

‘‘నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నా మొదటి సినిమాకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా’’ అని చెప్పారు ‘కాలింగ్ బెల్’ దర్శకుడు పన్నా రాయల్. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితీ ఖన్నా ముఖ్య తారలుగా గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై అనూద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ -‘‘వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నేను ఓ పెద్ద సినిమా తీద్దామని వచ్చా. కానీ ముందు ఓ చిన్న సినిమా తీయమని స్నేహితులు సలహా ఇచ్చారు. అందుకే ‘కాలింగ్ బెల్’ సినిమా తీశా. చిన్న సినిమా అయినా బాగా ఆదరిస్తున్నారు. ఇక నుంచి అడ్వెంచరస్, సస్పెన్స్ నేపథ్యంలో సినిమాలు తీసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement