167 కోట్లు పలికిన రవి వర్మ చిత్రం | Raja Ravi Varma painting sets 167 crore record Price | Sakshi
Sakshi News home page

167 కోట్లు పలికిన రవి వర్మ చిత్రం

Apr 3 2026 12:18 PM | Updated on Apr 3 2026 12:24 PM

Raja Ravi Varma painting sets 167 crore record Price

న్యూఢిల్లీ: ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవి వర్మ కుంచె నుంచి జాలువారిన ‘యశోద మరియు కృష్ణుడు’చిత్రం రికార్డు ధర పలికింది. ముంబైలో బుధవారం చేపట్టిన ‘సఫ్రాన్‌ఆర్ట్‌ స్ప్రింగ్‌ లైవ్‌ ఆక్షన్‌’లో ఏకంగా రూ.167.20 కోట్లకు అమ్ముడైంది. గతంలో మరో భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ గీసిన గ్రామ్‌ యాత్ర చిత్రం గతేడాది నిర్వహించిన వేలంలో రూ.118 కోట్లు రాబట్టి, రికార్డు నెలకొల్పింది.

తాజాగా రవివర్మ చిత్రం ఆ రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా, యశోద మరియు కృష్ణుడు కళాఖండం రూ.80 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేశారు. అయితే, అంచనాకు మించి రూ.167 కోట్లతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ డాక్టర్‌ సైరస్‌ ఎస్‌ పూనావాలా దీనిని సొంతం చేసుకున్నారు. రాజా రవి వర్మ దీనిని 1890ల్లో చిత్రించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement