త్రివిక్రమ్‌ ఐదేళ్ల తరువాత..! | C Kalyan To Produce Nani Trivikram Srinivas Film | Sakshi
Sakshi News home page

Jun 9 2018 3:56 PM | Updated on Jun 9 2018 7:46 PM

C Kalyan To Produce Nani Trivikram Srinivas Film - Sakshi

టాలీవుడ్ టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో ముందు వరసలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. అజ్ఞాతవాసి ముందు వరకు వరుస విజయాలతో సత్తా చాటిన త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా అరవింద సమేత సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే అత్తారింటికి దారేది సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లోనే తెరకెక్కాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్‌ సినిమా కూడా ఇదే బ్యానర్‌లో తెరకెక్కుతోంది.

కానీ ఐదేళ్ల విరామం తరువాత త్రివిక్రమ్‌ బయటి బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. 2013లో రిలీజ్‌ అయిన అత్తారింటికి దారేది తరువాత త్రివిక్రమ్‌ ఇతర బ్యానర్‌లలో సినిమాలు చేయలేదు. ఇన్నాళ్ల తరువాత నాని హీరోగా సీకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్నారు. నాని, త్రివిక్రమ్‌లు ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన వెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement