సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు | C Kalyan Launches Shiva 143 Movie Trailer | Sakshi
Sakshi News home page

సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు

Dec 10 2019 2:32 AM | Updated on Dec 10 2019 2:32 AM

C Kalyan Launches Shiva 143 Movie Trailer - Sakshi

‘‘చిన్న సినిమాలు మాత్రేమే తీస్తాను అని ఒట్టు పెట్టుకుని బడ్జెట్‌ దాటకుండా చిత్రాలు తీస్తున్నాడు రామ సత్య నారాయణ. ఒక ఫ్లాప్‌ తీస్తే ఆ నిర్మాత మళ్లీ సినిమా తీయలేని పరిస్థి తులున్న ఈ రోజుల్లో హిట్, ఫ్లాప్‌కి అతీతంగా సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు. ఈ ‘శివ 143’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్‌. శైలేష్‌ సాగర్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను హైదరాబాద్‌ వచ్చినçప్పుడు ఓనమాలు దిద్దించారు కళ్యాణ్‌గారు. నేను ఇన్ని  సినిమాలు తీశానంటే అది ఆయన నేర్పిన విద్యే’’ అన్నారు. ‘‘భీమవరం టాకీస్‌ బ్యానర్‌లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది’’ అన్నారు శైలేష్‌ సాగర్‌. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్, సంగీతం: మనోజ్‌.
∙రామసత్యనారాయణ, ఐషా, సి.కల్యాణ్, శైలేష్‌ సాగర్, డీఎస్‌ రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement