నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ | Boyapati Srinu Movie With Allu Arjun | Sakshi
Sakshi News home page

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

Jul 20 2019 10:38 AM | Updated on Jul 20 2019 10:38 AM

Boyapati Srinu Movie With Allu Arjun - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ వరుసపెట్టి సినిమాలు ఓకె చేస్తున్నాడు. స్టార్‌ డైరెక్టర్లతో పాటు కొత్త దర్శకులకు కూడా చాన్స్‌ ఇస్తున్న సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు బన్నీ.

ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేతిలో ఉన్న బన్నీ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల ఓ సినీ వేడుకలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో త్వరలో సినిమా ఉంటుందని చెప్పారు నిర్మాత అల్లు అరవింద్‌. ఈ సినిమా అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో బన్నీ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సరైనోడు ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement