బోయపాటి, బెల్లంకొండ సినిమా మొదలైంది..! | Boyapati Srinu, Bellamkonda Srinivas movie Updates | Sakshi
Sakshi News home page

బోయపాటి, బెల్లంకొండ సినిమా మొదలైంది..!

Sep 24 2016 11:34 AM | Updated on Aug 3 2019 12:45 PM

బోయపాటి, బెల్లంకొండ సినిమా మొదలైంది..! - Sakshi

బోయపాటి, బెల్లంకొండ సినిమా మొదలైంది..!

ఈ ఏడాది మొదట్లో సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బోయపాటి శ్రీను ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టలేదు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్గా పేరున్న బోయపాటి, యంగ్ హీరో బెల్లంకొండ...

ఈ ఏడాది మొదట్లో సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బోయపాటి శ్రీను ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టలేదు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్గా పేరున్న బోయపాటి, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా.. సెట్స్ మీదకు మాత్రం రాలేదు.

అయితే శనివారం మరోసారి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారన్న టాక్ వినిస్తోంది. కొత్త ఆఫీస్లో పూజా కార్యక్రమాలతో సినిమా పనులను మొదలపెట్టారు. ఇప్పటికే కథా కథనాలు సిద్ధంగా ఉండటంతో త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్పై ఉన్న అనుమానల విషయంలో క్లారిటీ వచ్చినట్టే అని భావిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ షెడ్యూల్స్కు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement