బెల్లంకొండ కోసం బోయపాటి ప్లాన్ | Boyapati ropes in Big star for Bellamkonda Movie | Sakshi
Sakshi News home page

బెల్లంకొండ కోసం బోయపాటి ప్లాన్

May 14 2016 8:47 AM | Updated on Aug 3 2019 12:45 PM

బెల్లంకొండ కోసం బోయపాటి ప్లాన్ - Sakshi

బెల్లంకొండ కోసం బోయపాటి ప్లాన్

సరైనోడు సినిమా సక్సెస్తో వంద కోట్ల వసూళ్లను సాధించిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇప్పుడు ఓ యంగ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు.

సరైనోడు సినిమా సక్సెస్తో వంద కోట్ల వసూళ్లను సాధించిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇప్పుడు ఓ యంగ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా తరువాత కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సరైనోడు సక్సెస్ కన్నా ముందే కమిట్ అయిన సినిమా కావటంతో ఇంతటి భారీ విజయం తరువాత బెల్లంకొండ సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

అయితే బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ సీన్స్, అదే స్థాయిలో స్టార్ కాస్ట్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. మరి సాయి లాంటి యంగ్ హీరో మీద అంత బడ్జెట్ వర్క్ అవుట్ కాదన్న ఆలోచనతో కొత్త ప్లాన్స్ వేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో ఓ లెంగ్తీ గెస్ట్ రోల్లో ఓ స్టార్ హీరోను నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సినిమాకే హైలెట్ కానున్న ఈ పాత్ర బిజినెస్ పరంగా కూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కోసం బోయపాటి శ్రీను చేస్తున్న ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement